Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌.. హార్దిక్‌ పాండ్యా ర్యాంప్‌ వాక్‌

Indian Cricketer Hardik Pandya walks the ramp at Lakme Fashion Week

హైదరాబాద్: క్రికెట్ నుండి విరామం తీసుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో సందడి చేసాడు. ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసిన హార్దిక్ అందరిని అలరించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఈ కార్యక్రమంలో ర్యాంప్‌ వాక్‌ చేసాడు.

వెస్టిండీస్ పర్యటన నుండి విశ్రాంతి తీసుకున్న పాండ్యా సోదరులు తమ మోడలింగ్ నైపుణ్యాలను చూపించారు. హార్దిక్ పాండ్యా డిజైనర్ అమిత్ అగర్వాల్ కోసం ర్యాంప్‌లో పాల్గొన్నాడు. ఈ ర్యాంప్‌ వాక్‌లో పాండ్యా సోదరులు వెరైటీ దుస్తుల్లో కనిపించి అక్కడివారిని కనువిందు చేశారు. సోదరులు ఇద్దరు కలిసి కూడా ర్యాంప్‌ వాక్‌ చేశారు. హార్దిక్ తన ర్యాంప్‌ వాక్‌కు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కొందరు అభిమానులు హార్దిక్‌ పాండ్యాను బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో పోల్చుతున్నారు.

ప్రపంచకప్‌కు ముందు కరణ్ జోహార్ నిర్వహించిన 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం హార్దిక్ బహిరంగంగా తక్కువ ప్రొఫైల్‌ను మైంటైన్ చేస్తున్నాడు. ప్రపంచకప్‌లో రాణించిన పాండ్యాకు విండీస్ పర్యటనలో సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. ప్రస్తుతం హార్దిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన జట్టులో పాండ్య సోదరులు ఉన్నారు.

Story first published: Friday, August 23, 2019, 14:27 [IST]
Other articles published on Aug 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+