Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక స్పిన్నర్‌కు న్యూజిలాండ్ దాసోహం: టీ విరామానికి కివీస్ 179/5

Sri Lanka vs New Zealand 1st Test Day 1: New Zealand are 179 for 5 - Rain Delay

హైదరాబాద్: గాలే వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన తొలి టెస్టు, తొలి రోజుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు టీ విరామం ప్రకటించారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 60.2 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(70) పరుగులతో ఉన్నాడు.

తొలి సెంచరీని ఆగస్టు 14నే.. సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా జీత్ రావల్, టామ్ లాథమ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత జట్టు స్కోరు 64 పరుగుల వద్ద టామ్ లాథమ్(30) ఔటయ్యాడు.

లంక స్పిన్నర్ అకిలా ధనుంజయ బౌలింగ్‌లో నిరోషాన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ అదే స్కోరు వద్ద అకిలా ధనుంజయ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్‌తో కలిసి నిలకడగా ఆడుతున్న జీత్ రావల్‌ను సైతం అకిలా ధనుంజయ పెవిలియన్‌కు చేర్చాడు.

భారత్ Vs విండిస్: సిరిస్ విజేతను తేల్చే 3rd ODIకి పొంచి ఉన్న వర్షం ముప్పు?

అకిలా ధనుంజయ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ జీత్ రావల్(33) పరుగుల వద్ద ధనుంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. లంచ్ విరామం ముందు వరకు రాస్ టేలర్, హెన్రీ నికోల్స్ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

అనంతరం వీరిద్దరూ మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాస్ టేలర్ నిలకడగా ఆడుతూ టెస్టుల్లో 31వ హాఫ్ సెంచరీని సాధించాడు. అయితే జట్టు స్కోరు 171 పరుగుల వద్ద హెన్రీ నికోల్స్(42) హాఫ్ సెంచరీ ముంగిట అకిలా ధనుంజయ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బీజే వాట్లింగ్ మరో ఎనిమిది పరుగులు జోడించిన తర్వాత అకిలా ధనుంజయ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కి ఆటంకం కలిగించాడు. దీంతో అంఫైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.

Story first published: Wednesday, August 14, 2019, 15:41 [IST]
Other articles published on Aug 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+