
హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరిగే స్టేడియం పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం కొంత సేపు వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది.

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. అయితే, లక్ష్య చేధనలో వెస్టిండిస్ 210 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలి వన్డేకు వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన తొలి వన్డేను తొలుత అంపైర్లు 43 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన వెస్టిండిస్ జట్టు బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్‌ను అంఫైర్లు 34 ఓవర్లకు కుదించారు.
అయితే, ఇందులో కూడా 13 ఓవర్ల పాటు ఆట సజావుగా సాగింది. అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.