Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం డేవిడ్ వార్నర్.. వృషణాలకు తగిలిన బెయిల్! విలవిలలాడిన ఆసీస్ స్టార్! (వీడియో)

కొలంబో: శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. గాలే వేదికగా శుక్రవారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ భారీ గెలుపుతో సిరీస్‌లో 1-0‌తో ఆధిక్యంలో నిలిచిన కమిన్స్ సేన.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ వృషణాలకు బెయిల్ బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ట్రావిస్ హెడ్ వేసిన 22వ ఓవర్ తొలి బంతిని ఆడటంలో బ్యాటర్ జెఫ్ఫెరీ వాండర్సే విఫలమయ్యాడు. దాంతో బంతి నేరు వికెట్లను తాకగా.. గాల్లోకి లేచిన స్టంప్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ వృషణాలకు బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా 321 పరుగుల భారీ స్కోర్ చేసి 109 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం శ్రీలంకను ఫాలోఆన్ ఆడించిన ఆసీస్..

రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 113 పరుగులకే పరిమితం చేసింది. దాంతో ఆసీస్ ముందు 5 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయసంగా ఛేదించి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీలంక బ్యాటింగ్ పతనాన్ని నాథన్ లయన్, ట్రావిస్ హెడ్ చెరో 4 వికెట్లతో శాసించారు. ఈ భారీ విజయంతో ఆస్ట్రేలియా డబ్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.88 విజయాల శాతంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత సౌతాఫ్రికా (71.43 విజయాల శాతం), భారత్(58.33 శాతం) ఉన్నాయి.

Story first published: Friday, July 1, 2022, 18:55 [IST]
Other articles published on Jul 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+