Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sri Lanka vs Afghanistan: అఫ్గాన్‌కు షాకిచ్చిన శ్రీలంక!

Sri Lanka Beat Afghanistan By 4 Wickets In Nail-Biter

షార్జా: ఆసియాకప్ 2022 సూపర్ 4లో శ్రీలంక శుభారంభం చేసింది. అఫ్గానిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో లీగ్ మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక అఫ్గాన్ అనవసర తప్పిదాలతో ఈ మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు తేలిపోయారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. రెహ్మానుల్లా గుర్బాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇబ్రహీమ్ జడ్రాన్(38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక రెండు వికెట్లు తీయగా.. అసిత ఫెర్నాండో, మహీష్ తీక్షణ తలో వికెట్ పడగొట్టాడు.

అనంతరం శ్రీలంక 19.1 ఓవర్లలో 179 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35), కుశాల్ మెండీస్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), భానుక రాజపక్స(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించగా.. హసరంగా(9 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్), కరుణరత్నే(5 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు ఓపెనర్లు నిస్సంక, మెండీస్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీయగా.. నిస్సంక ముజీబ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే చరిత్ అసలంక(8)ను నబీ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో దనుష్క గుణతిలక(33), కెప్టెన్ డసన్ షనక ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. డసన్ షనకను ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఔట్ చేయడంతో 119 పరుగులకు లంక 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో భానుక రాజపక్స, వానిందు హసరంగా జట్టు విజయానికి బాటలు వేసారు. కరుణరత్నే బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Saturday, September 3, 2022, 23:27 [IST]
Other articles published on Sep 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+