Sri Lanka vs Afghanistan:అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నా: శ్రీలంక కెప్టెన్

షార్జా: ఆసియాకప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ జట్టుకు చేజింగ్‌లో మంచి రికార్డు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. టాస్ గెలవడం తమకు కలిసొచ్చే విషయమని సంతోషం వ్యక్తం చేశాడు. ఓపెనర్లు శుభారంభం అందించి, మిడిలార్డర్‌లో మంచి భాగస్వామ్యాలు వస్తే మ్యాచ్‌పై పూర్తిగా పట్టుసాధిస్తామని తెలిపాడు. బంగ్లాదేశ్‌తో గత మ్యాచ్‌లో ఇలానే రాణించి విజయం సాధించామని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు.
మరోవైపు మహమ్మద్ నబీ మాత్రం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని, టాస్ ఓడినా తమకు మంచే జరిగిందన్నాడు. టోర్నీలో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉందన్న నబీ.. ఈ రోజు కూడా బౌలింగ్‌లో అదే జోరు కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌తో తమ జట్టు అద్భుతంగా రాణించిందని, మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. జట్టులో ఒక్క మార్పు చేశామని చెప్పిన నబీ.. అజమ్‌తుల్లా స్థానంలో షినవారీ వచ్చాడని పేర్కొన్నాడు.
తుది జట్లు:
అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జాజై, రహ్మనుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జడ్రాన్, మహమ్మద్ నబీ(కెప్టెన్), నజిబుల్లా జడ్రాన్, కరీమ్ జనత్, సమియుల్లా షిన్వారి, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డసన్ షనక, వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మదుషంక
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications