
ఆందోళనకు గురయ్యాం..
'ఇంధన నష్టం జరగడంతో మా విమానాన్ని భారత్‌కు దారి మళ్లించారు. అక్కడ మేం దిగగానే నా ఫోన్ ఆన్ చేశాను. ఇంగ్లాండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి నాకు కొన్ని సందేశాలు వచ్చాయి. పరిస్థితి గురించి అందులో వివరించాడు. దాంతో నిజంగా మేమంతా ఆందోళన చెందాం' అని ఆర్థర్ పేర్కొన్నాడు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో గెలిచి లంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఈ పర్యటన ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరారు. తీరా భారత్‌లో దిగాక విమానం దారి మళ్లించారన్న విషయం వారికి తెలిసింది.

భారత్‌తో సిరీస్‌లో మార్పు..
ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

మాథ్యూస్ రిటైర్మెంట్..
కాంట్రాక్ట్‌పై సంతకం చేయడానికి శ్రీలంక స్టార్ క్రికెటర్లు ససేమిరా అంటున్నారన్న వార్తల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజిలో మాథ్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవకాశమున్నట్లు సమాచారం. వన్డేలు, టీ20ల నుంచి తనను తప్పించడంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు చాన్సిచ్చే పేరుతో లంక సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. అయితే కొంతకాలం శ్రీలంక క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న చాలా తక్కువ మంది ప్లేయర్స్‌లో మాథ్యూస్ ఒకడు. అలాంటి ప్లేయర్‌ను తప్పించడం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మాథ్యూస్ లంక తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాదు. మొత్తం 13,219 పరుగులు, 218 వికెట్లు తీయడం విశేషం.

30లో 29 మంది గ్రీన్ సిగ్నల్..
జాతీయ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) బెదిరింపులు ఫలించాయి. మొత్తం 30 మందిలో 29 మంది లంక ఆటగాళ్లు కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎస్‌ఎల్‌సీ స్వయంగా ధ్రువీకరించింది. కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేసేందుకు ఎస్‌ఎల్‌సీ 36 గంటల సమయం (జూలై 8) ఇవ్వగా.. ఒక రోజు ముందే లంక ప్లేయర్స్ దిగొచ్చారు. దీంతో బోర్డు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం ఒప్పందంపై సంతకం చేయలేదు. అతడే సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్.


Click it and Unblock the Notifications












