Sri Lanka T20 Squad: స్టార్ ప్లేయర్లకు షాక్.. భారత్‌పై రాణించిన ఆటగాళ్లకు చోటు! ఆ కెప్టెన్ వైపే మొగ్గు!!

కొలంబో: సెప్టెంబర్ నెలలో యూఏఈ, ఒమన్‌లో ప్రారంభమయ్యే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 కోసం జట్లను ఆయా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, నమీబియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా తమ 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్‌ల లిస్టును ప్రకటించాయి. తాజాగా శ్రీలంక కూడా టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. లంక ప్రపంచకప్ జట్టుకు దాసున్ శనక సారథ్యం వహిస్తుండగా.. ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ధనంజయ్ డి సిల్వా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

హసరంగ, దుష్మంతకు చోటు
శ్రీలంక జట్టు ఇటీవల దాసున్ శనక నాయకత్వంలో టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన మూడు టీ20ల సిరీసును లంక 2-1తో కైవసం చేసుకుంది. లెగ్ స్పిన్నర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరా కూడా లంక ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. భారత్‌పై జట్టును గెలిపించడంలో వారిద్దరూ ముఖ్యమైన పాత్ర పోషించారు. టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో, హసరంగ ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు, రెండో మ్యాచ్‌లో ఒక వికెట్, మూడవ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత్‌ను ఓడించాడు. దాంతో అతడు మెగా టోర్నీకి ఎంపికయ్యాడు.

21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్‌కు చోటు
శ్రీలంక జట్టులోని కొంతమంది స్టార్ ప్లేయర్లకు జట్టులో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. ఇందులో నిరిషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలు ఉన్నారు. ఇంగ్లండ్‌లో కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు జూలైలో ఈ ముగ్గురిపై నిషేధం పడింది. అయితే కుషాల్ పెరీరా గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలను మినోద్ భానుక్ చూసుకోనున్నాడు. 21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మహిష్ తిక్షణ ప్రపంచకప్ కోసం జట్టులో చేరాడు. అతను ఇటీవల మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీ20లో అరంగేట్రం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేశాడు. తన వన్డే అరంగేట్రంలో కూడా ఆకట్టుకున్నాడు.

ప్రవీణ్ జయవిక్రమకు చోటు
స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమకు కూడా చోటు దక్కింది. మహిష్ తిక్షణ, వనిందు హసరంగలతో పాటు జయవిక్రమ స్పిన్నర్లుగా జట్టులో ఉన్నారు. ఇతర ఫార్మాట్లలో బలమైన ప్రదర్శనల ఆధారంగా.. అతను టీ20 జట్టులో చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌పై తన తొలి టెస్టులో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐదు వన్డేలు ఆడి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక రిజర్వ్ ప్లేయర్లుగా లహిరు కుమార, బినూరు ఫెర్నాండో, అకిలా ధనంజయ, పులినా తరంగాలు ఎంపికయ్యారు. శ్రీలంక మొదటగా క్యాలిఫైర్ మ్యాచులు ఆడనుంది.

శ్రీలంక టీ20 జట్టు ఇదే
దాసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డి సిల్వా (వైస్-కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిశ్వక ఫెర్నాండో, బి రాజపక్స, సి అసలంగా, వనిందు హసరంగ, కమిందు మెండిస్, సి కరుణరత్నే, ఎన్ ప్రదీప్, దుష్మంత చమీరా, పి జయవిక్రమ, ఎల్ మధుశంక, ఎం తేక్షణ.
రిజర్వ్ ప్లేయర్స్: లహిరు కుమార, బినూరు ఫెర్నాండో, అకిలా ధనంజయ, పులినా తరంగా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రాజస్తాన్ రాయల్స్‌కు గుడ్ న్యూస్.. సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన విండీస్ హిట్టర్! 52 బంతుల్లో సెంచరీ!!