For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్తాన్‌ రాయల్స్‌కు గుడ్ న్యూస్.. సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన విండీస్ హిట్టర్! 52 బంతుల్లో సెంచరీ!!

Before the IPL 2021 Rajasthan Royals batsman Evin Lewis hits century in CPL 2021

సెంట్‌కిట్స్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు సమయం ఆసన్నమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభం కానున్నాయి. మెగా టోర్నీ కోసం ఇప్పటీకే అన్ని జట్లు యూఏఈ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నాయి.

అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌కు ఓ శుభవార్త అందింది. ఆ జట్టు హిట్టర్ ఎవిన్‌ లూయిస్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌ 2021)లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థిని వణికించాడు.

సిమ్మన్స్, పోలార్డ్ విఫలం

సిమ్మన్స్, పోలార్డ్ విఫలం

సెంట్‌కిట్స్‌ వేదికగా శనివారం రాత్రి ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌, సెంట్‌ కిట్స్‌ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో సునీల్‌ నరైన్‌ (18 బంతుల్లో 33, 4 సిక్సర్లు, ఒక ఫోర్‌) ఆకట్టుకున్నాడు. లెండిల్ సిమ్మన్స్ (11), దినేష్ రాందిన్ (10), కీరన్ పోలార్డ్ (15), టిమ్ సీఫెర్ట్ (1) పూర్తిగా విఫలమయ్యారు. సెంట్‌ కిట్స్‌ బౌలర్లలో డొమినిక్‌ డ్రేక్స్‌, జాన్‌ జాగేసర్‌ చెరో 3 వికెట్లు తీశారు.

52 బంతుల్లో సెంచరీ

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్‌ కిట్స్‌ 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్రిస్ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా గేల్‌ ఉన్నంతసేపు ప్రత్యర్థి బౌలర్లను దడదడలాడించాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. గేల్‌ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌ ఉన్నాయి. గేల్‌ ఔటైన తర్వాత బాధ్యతను ఎత్తుకున్న లూయిస్‌ మిగతా పనిని పూర్తి చేశాడు.

వరుస బౌండరీలతో హడలెత్తించాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో 102 పరుగులు చేశాడు. సిక్స్ సాయంతో సెంచరీ అందుకున్నాడు. లూయిస్‌ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ విజయంతో సెంట్‌ కిట్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది.

IND vs ENG:ఐదో టెస్టు విషయంలో.. ఐసీసీ సాయం కోరిన ఈసీబీ! ముందున్న ఆ రెండు ప్రత్యామ్నాయాలు ఇవే!!

రాయల్స్ అభిమానుల ఆనందం

రాయల్స్ అభిమానుల ఆనందం

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ పలు కారణాలతో ఐపీఎల్ 2021 రెండో దశకు దూరమయిన విషయం తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ , వ్యక్తిగత కారణాలతో వికెట్ కీపర్ జోస్ బట్లర్.. గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ నుంచి వైదొలగారు. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో రాయల్స్ బలహీనపడింది. అయితే బట్లర్‌ స్థానాన్ని ఎవిన్‌ లూయిస్‌, స్టోక్స్‌ ప్లేస్‌ను ఒషేనే థోమాస్‌తో రీప్లేస్‌ చేసింది. దాంతో రాయల్స్‌ జట్టు బలంగా మారింది. ఐపీఎల్ టోర్నీకి ముందు లూయిస్‌ విధ్వంసం సృష్టించడంతో రాయల్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హార్డ్‌ హిట్టర్‌గా గుర్తింపు

హార్డ్‌ హిట్టర్‌గా గుర్తింపు

ఎవిన్‌ లూయిస్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాడు. 16 మ్యాచ్‌ల్లో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 131 స్ట్రయిక్‌ రేట్‌తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఎవిన్‌ లూయిస్‌కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్‌ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్‌ తరఫున 45 మ్యాచ్‌ల్లో 158 స్ట్రయిక్‌ రేట్‌తో 1318 పరుగులు చేశాడు.

ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రీజులోకి రావడమే ఆసల్యం బంతిని బాదడమే అతనికి తెలిసింది. తుది జట్టులో లూయిస్‌ కచ్చితంగా ఉండనున్నాడు. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌లో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 21న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌.. పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్‌లో రాజస్తాన్‌ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

Story first published: Sunday, September 12, 2021, 14:36 [IST]
Other articles published on Sep 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+