Asia Cup 2022: ఆ ఒక్కటే శ్రీలంకను ఛాంపియన్‌గా నిలబెట్టింది..!

దుబాయ్: జట్టులో సూపర్ స్టార్లు లేరు.. ఫేవరేట్ హోదా అంతకన్నా లేదు.. బ్యాటింగ్ లైనప్‌లో నిలకడలేమి.. బౌలింగ్‌లో నాణ్యత లేదు.. ఆసియాకప్‌కు ముందు శ్రీలంక జట్టు పరిస్థితి ఇది. అందుకు తగ్గట్లుగానే అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం. దాంతో సూపర్ 6 కూడా చేరదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనబర్చిన శ్రీలంక ఏకంగా టైటిల్ గెలిచి వరల్డ్ క్రికెట్‌ను ఆశ్చర్యంలో పడేసింది. అయితే టాస్ కీలక ప్రభావం చూపించిన ఈ మ్యాచ్‌లో లంకకు కాస్త లక్ కూడా కలిసొచ్చిన మాట వాస్తవం. కానీ ఫైనల్లో ఆ జట్టు టాస్ ఓడినా.. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా పట్టుదలతో ఆడి పాక్ పని పెట్టింది.

సెన్సేషనల్ ఫీల్డింగ్‌తోనే..
లక్‌తో కాకుండా కష్టపడి గెలిచామని యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది. స్టార్ ఆటగాళ్లు కలిగిన టీమిండియా.. పట్టిష్ట బౌలింగ్ దళం ఉన్న అఫ్గాన్, బలమైన పేస్ అటాక్ కలిగిన పాకిస్థాన్‌లను ఓడించి లంక టైటిల్ గెలిచింది. అయితే ఆ జట్టు విజయానికి ప్రధాన కారణం సమష్టిగా రాణించడం ఒకటైతే.. మరొకటి సెన్సేషనల్ ఫీల్డింగ్. ఇతర జట్ల కంటే ఆ జట్టు ఎంతో మెరుగ్గా ఫీల్డింగ్ చేసింది. అసాధారణమైన క్యాచ్‌లను పట్టుకుంది. ఎన్నో బౌండరీలను ఆపి పరుగులను నియంత్రించింది.

ఫిల్డింగ్‌తో ఇబ్బంది పెట్టి..
లంక ఆటగాళ్ల సూపర్ ఫీల్డింగ్‌తో బౌలర్లు చెలరేగారు. పరుగులు రాక ఒత్తిడికి గురైన ప్రత్యర్థి బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. దీనికి ఫైనల్ మ్యాచే ఉదహారణ. దుబాయ్ వికెట్‌పై 171 పరుగుల లక్ష్యం సునాయసంగా చేధించదగినది. కానీ లంక తమ అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాక్‌ను ఒత్తిడికి గురిచేసింది. బౌండరీ వెళ్లాల్సిన బంతులను ఆపి పాక్ బ్యాటర్లకు చికాకు తెప్పించింది. ఈ క్రమంలోనే క్రీజులో సెట్ అయిన రిజ్వాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔటయ్యాడు.

పేలవ ఫీల్డింగ్‌తోనే భారత్...
ఇక కీలక సమయంలో పాక్ క్యాచ్ నేలపాలు మూల్యం చెల్లించుకుంటే శ్రీలంక మాత్రం ఒక్క తప్పిదం చేయలేదు. టోర్నీ మొత్తంలో ఆ జట్టు ఒక్క క్యాచ్ కూడా వదిలిపెట్టలేదు. ఇదే వికెట్‌పై భారత్ పాక్‌తో 181, శ్రీలంకతో 173 పరుగుల లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. పాక్‌తో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్షదీప్ సింగ్ నేలపాలు చేసి జట్టు ఓటమికి కారణం కాగా.. శ్రీలంకతో రిషభ్ పంత్ డసన్ షనకను స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications