Danushka Gunathilaka: అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట!

సిడ్నీ: అత్యాచారం కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు భారీ ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను సిడ్నీ కోర్టు మంజూరు చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వచ్చిన గుణతిలక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది.
సదరు మహిళా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు.. గుణతిలక ఉన్న హోటల్‌కు వచ్చి అరెస్ట్ చేశారు. గత 11 రోజులగా గుణతిలక జైలులోనే ఉండగా.. బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. దాంతో గుణతిలక అక్కడి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

కండిషనల్ బెయిల్..
శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా జోక్యం చేసుకోవడంతో 11 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్ లభించింది. కేసు పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని, 150,000 ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ, కోటి రూపాయలు) జరిమానతో పాటు పాస్ పోర్ట్‌ను స్వాదీనం చేసుకుంది.
రెండు రోజులకోసారి పోలీస్‌లకు రిపోర్ట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియా ఉపయోగించివద్దని తెలిపింది. అంతేకాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గుణతిలకపై నిఘా ఉంటుందని, తనపై ఫిర్యాదు చేసిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని కూడా హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 12న జరగనుంది.

గాయంతో జట్టుకు దూరమైనా..
టీ20 ప్రపంచకప్ నుంచి లీగ్ దశలోనే వైదొలగిన శ్రీలంక జట్టు.. తిరిగి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. నవంబర్ 6న అర్ధరాత్రి ధనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్ టీమ్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిని చవిచూసింది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు ముందే గుణతిలక తన జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టీమ్ మరో వ్యక్తిని ఎంపిక చేసుకుంది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ సలహా మేరకు ఆ తర్వాత కూడా అతను అక్కడే ఉండిపోయాడు.

అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్..
అరెస్ట్ అయిన గుణతిలకను అక్కడే వదిలేసిన శ్రీలంక జట్టు స్వదేశానికి పయనం కాగా.. అన్ని ఫార్మాట్ల నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. గుణతిలక లంక తరఫున ఇప్పటి వరకు 47 వన్డేలు, 46 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడాడు. గుణతిలకకు వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ గుణతిలక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రీలంక బోర్డు 6 మ్యాచ్‌లు నిషేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications