న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ పర్యటనకు సీనియర్లు దూరం: వన్డే, టీ20 జట్లను ప్రకటించిన శ్రీలంక

 Sri Lanka announce second string squad for Pakistan tour after top stars pull out

హైదరాబాద్: పాకిస్థాన్ పర్యటనకు శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం జట్టుని ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ వరకు జరగనున్న ఈ పర్యటనలో శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అయితే, భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరిస్‌లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు.

'అనుభవాన్ని మార్కెట్‌లో అమ్మలేం లేదా కొనలేం''అనుభవాన్ని మార్కెట్‌లో అమ్మలేం లేదా కొనలేం'

ఈ నేపథ్యంలో ఆ పది మంది ఆటగాళ్లకు బోర్డు జట్టులో చోటు కల్పించలేదు. పాకిస్థాన్ పర్యటకు శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వితీయ శ్రేణి యువ ఆటగాళ్లతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ పర్యటనలో వన్డే సిరిస్‌కు కెప్టెన్‌గా లాహిరు తిరిమన్నేని నియమించగా టీ20లకు కెప్టెన్‌గా దాసున్ షణకాను బోర్డు నియమించింది.

భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని

భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని

భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక కెప్టెన్లు దిముత్ క‌రుణ‌ర‌త్నే, ల‌సిత్ మ‌లింగ‌లతో పాటు సీనియర్ ఆటగాళ్లు ఏంజిలో మాథ్యూస్, నిరోష‌న్ డిక్‌విల్లా, కుశ‌ల్ పెరీరా, ధ‌నంజ‌య డిసిల్వ‌, తిషార పెరీరా, అఖిల ధ‌నంజ‌య‌, సురంగ ల‌క్మ‌ల్‌, దినేశ్ చందీమ‌ల్ లాంటి సీనియర్ ఆట‌గాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాక‌రించారు.

యాషెస్ 2019: స్మిత్‌ను కట్టడి చేస్తారా? లేక ట్రోఫీని సమర్పించుకుంటారా?

గాయం కారణంగా కుశాల్ మెండిస్ దూరం

గాయం కారణంగా కుశాల్ మెండిస్ దూరం

గాయం కారణంగా కుశాల్ మెండిస్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం లేదని ముందుగానే సెలక్టర్లకు తెలిపాడు. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరిస్ కోసం ప్రకటించిన జట్లలో శ్రీలంక క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇటీవలే బంగ్లాతో జరిగిన వన్డే సిరిస్‌లో రాణించిన దాసున్ షణకాతో పాటు షెహన్ జయసూర్యలకు సెలక్టర్లు చోటు కల్పించారు.

వన్డేలకు జట్టు:

లాహిరు తిరుమన్నే(కెప్టెన్), సధీరా సమరవిక్రమా, అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దసున్ శనకా, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా.

టీ20 జట్టు:

దసున్ శనకా(కెప్టెన్), సధీరా సమరవిక్రమా,అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా, భానుక రాజపక్ష.

Story first published: Wednesday, September 11, 2019, 18:32 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X