Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగే టెస్ట్ టీమ్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ధనంజయ డిసిల్వా సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. కమిందు మెండిస్‌ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్లతో పాటు ఇటీవల టీమిండియా వామప్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న పలువురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది.

వెటరన్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముగ్గురు అనామక ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. సీనియర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ తొడ కండరాల గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మణికట్టు సర్జరీతో పాతుమ్ నిస్సంక సేవలను శ్రీలంక కోల్పోయింది. దాంతోనే 33 ఏళ్ల నిరోషన్ డిక్‌వెల్లాకు పిలుపు దక్కింది.

Sri Lanka Announce 16-Member Squad for 1st Test Against India As Niroshan Dickwella Returns After 3 Year
Photo Credit: X (twitter)

2023లో శ్రీలంక తరఫున అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే గాలే మైదానంలో బలమైన భారత బౌలింగ్ యూనిట్‌ను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్న శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌కు అతని చేరిక బలాన్ని చేకూర్చనుంది.

ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంత, బ్యాటర్ పాసిందు సూర్య బండారా, సోనా దినుషా తొలిసారి శ్రీలంక టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్నారు. ఇటీవల భారత్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో నువాంత మూడు వికెట్లు తీసాడు. భారత్‌-ఏ జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. దాంతో అతనికి శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఆగస్ట్ 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్ట్ జరగనుంది.

భారత్‌తో తొలి టెస్ట్‌కు శ్రీలంక టీమ్:

ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), లహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్), రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ ద్రువాల్నాండో, ఎఫ్‌సి ధృవాల్నాండో, ఎఫ్. మధుశంక.

Story first published: Wednesday, August 12, 2026, 16:58 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+