For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 6 సిక్స్‌లు.. శ్రీలంక ఆల్‌రౌండర్ అరుదైన ఘనత! (వీడియో)

 Sri Lanka all-rounder Thisara Perera smashes six sixes in an over, video goes viral

కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఫస్ట్ లంక ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. లంక క్లబ్‌స్థాయి క్రికెట్‌లో అతను ఈ రికార్డును అందుకున్నాడు. పనగోడలోని ఆర్మీ గ్రౌండ్‌లో జరిగిన మేజర్ క్లబ్స్ లిమిటెడ్ ఓవర్ లిస్ట్ ఎ టోర్నమెంట్‌లో.. బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌తో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో శ్రీలంక ఆర్మీకి ప్రాతినిధ్యం వహించిన తిసారా పెరీరా.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

 సిక్స్‌తో షురూ..

సిక్స్‌తో షురూ..

20 బంతులు మిగిలుండగా క్రీజులోకి వచ్చిన పెరీరా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్‌తో తన పరుగుల వేట ప్రారంభించిన ఈ శ్రీలంక ఆల్‌రౌండర్... చివరి ఓవర్లో ఆఫ్-స్పిన్ బౌలర్ దిల్హాన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. పెరీరా ధాటికి 34 ఏళ్ల కూరే తన నాలుగు ఓవర్లలో 73 పరుగులు సమర్పించుకున్నాడు.పెరీరా విజృంభనతో శ్రీలంక ఆర్మీ 41 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది.

9వ ఆటగాడిగా..

6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన క్లబ్‌లో 9వ ఆటగాడిగా పెరీరా చోటు దక్కించుకున్నాడు. ఈ నెల ఆరంభంలో శ్రీలంకపైనే వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ కీరన్ పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి 8వ ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌ వెస్టిండీస్‌కు చెందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కాగా.. అతను 1968 లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రవిశాస్త్రి (1985), హెర్షెల్ గిబ్స్ (2007), యువరాజ్ సింగ్ (2007), రాస్ వైట్లీ (2017), హజ్రతుల్లా జజాయ్ (2018), లియో కార్టర్ (2020), కీరోన్ పొలార్డ్ (2021), తిసారా పెరీరా (2021).

2007 టీ20 ప్రపంచకప్‌లో..

2007 టీ20 ప్రపంచకప్‌లో..

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. అప్పటి ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై కోపంతో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చిచిండాడాడు. 2007 కరేబియన్లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా హెర్షల్ గిబ్ ఈ ఘనతను అందుకొని అంతర్జాతీయ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన తొలి బ్యాటర్‌గా గుర్తింపుపొందాడు. గార్ఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రి దేశవాళీ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం యువీ, గిబ్స్, పొలార్డ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

Story first published: Monday, March 29, 2021, 19:12 [IST]
Other articles published on Mar 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+