Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: హ్యాట్రిక్ వికెట్ తీసిన SRH బౌలర్! (వీడియో)

ఆస్ట్రేలియా పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఉదయం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. కమిన్స్ సూపర్ బౌలింగ్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్లు మహ్మదుల్లా, మెహ్‌దీ హసన్, టౌహిడ్ హృదయ్ వరుసగా పెవిలియన్ చేరారు.

వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగగా.. కమిన్స్ నిప్పులు చెరిగాడు. 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మహ్మదుల్లా(2), మెహ్‌దీ హసన్‌ను ఔట్ చేసిన కమిన్స్.. చివరి ఓవర్ తొలి బంతికి టౌహిడ్ హృదయ్(4)ను పెవిలియన్ చేర్చాడు. మహ్మదుల్లాను క్లీన్ బౌల్డ్ చేసిన కమిన్స్, మెహ్‌దీ హసన్, టౌహిడ్ హృదయ్‌లను క్యాచ్ ఔట్ చేశాడు.

SRH s Pat Cummins Makes History With T20 World Cup 2024 Hat-trick

ప్రస్తుతం కమిన్స్ హ్యాట్రిక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్ తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. ఆసీస్ తరఫున బ్రెట్ లీ.. 2007 టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్ తీసాడు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలవడం విశేషం. బ్రెట్ లీ కూడా బంగ్లాదేశ్‌పైనే హ్యాట్రిక్ సాధించడం విశేషం.

టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్ తీసిన బౌలర్లు

బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా) వర్సెస్ బంగ్లాదేశ్- 2007

కర్టీస్ కాంఫెర్(ఐర్లాండ్) వర్సెస్ నెదర్లాండ్స్-2021

వానిందు హసరంగా(శ్రీలంక) వర్సెస్ సౌతాఫ్రికా-2021

కగిసో రబడా(సౌతాఫ్రికా) వర్సెస్ ఇంగ్లండ్-2021

కార్తీక్ మెయిప్పన్(యూఏఈ) వర్సెస్ శ్రీలంక-2022
జోషువా లిటిల్(ఐర్లాండ్) వర్సెస్ న్యూజిలాండ్-2022
ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) వర్సెస్ బంగ్లాదేశ్-2024

టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ఆస్ట్రేలియా బౌలర్లు

బ్రెట్ లీ వర్సెస్ బంగ్లాదేశ్-2007
అష్టన్ అగర్ వర్సెస్ సౌతాఫ్రికా-2020
నాథన్ ఎల్లిస్ వర్సెస్ బంగ్లాదేశ్-2021
ప్యాట్ కమిన్స్ వర్సెస్ బంగ్లాదేశ్-2024

కమిన్స్(3/29) హ్యాట్రిక్ ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేసింది. టౌహిడ్ హృదయ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), నజ్ముల్ హోస్సేన్ షాంటో(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా(2/24) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8.5 ఓవర్లలో 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(53 బ్యాటింగ్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(14 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, June 21, 2024, 10:00 [IST]
Other articles published on Jun 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+