న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్.. లీగ్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్‌రౌండర్!

 SRHs Mitchell Marsh pulls out of IPL 2021 citing bubble fatigue
IPL 2021: SRH బయో బబుల్‌లో లో ఉండలేక తప్పుకున్న Mitchell Marsh స్థానంలో Jason Roy | Warner Is Coming

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. కరోనా నేపథ్యంలో కఠిన బయో బబుల్‌లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడని తాజాగా క్రిక్‌బజ్ పేర్కొంది. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాలి. దీన్ని కష్టంగా భావించిన అతను లీగ్ నుంచి తప్పుకున్నాడు.

ఇంగ్లండ్ ప్లేయర్‌తో..

ఇంగ్లండ్ ప్లేయర్‌తో..

ఇక మిచెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఓ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఈ సీజన్ వేలంలో అమ్ముడు పోనీ జాసన్ రాయ్ కోసం హైదరాబాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జాసన్ రాయ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జాసన్ రాయ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

రూ. 2 కోట్లు దండగ..

రూ. 2 కోట్లు దండగ..

ఇక ఐపీఎల్ 2020 వేలంలో మార్ష్‌ను అతని కనీస ధర రూ.2 కోట్లకు తీసుకోగా.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో అతను ఫస్ట్ మ్యాచ్‌లోనే గాయపడి జట్టుకు దూరమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో మార్ష్ యాంకిల్‌కు గాయమైంది. దాంతో అతను ఆ సీజన్ మొత్తానికి దూరం కాగా.. ఆరెంజ్ ఆర్మీ వెస్టిండీస్ స్టార్ జాసన్ హోల్డర్‌ను తీసుకుంది. అతను బాగా రాణించడంతో పాటు మార్ష్ పూర్తిగా గాయం నుంచి కోలుకొని న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొనడంతో హైదరబాద్ ఈ ఇద్దరిని రిటైన్ చేసుకుంది.

భారత్‌కు బయల్దేరిన వార్నర్..

భారత్‌కు బయల్దేరిన వార్నర్..

(ఐపీఎల్) 2021 సీజన్‌కు దూరమవుతాడనే ఊహాగానాలకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయల్దేరాడు. భారత్ పర్యటనలో గజ్జ గాయానికి గురైన డేవిడ్ వార్నర్.. పూర్తిగా నయమవ్వకుండానే టెస్ట్ సిరీస్‌ ఆడాడు. దాంతో గాయం తిరగబెట్టి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు ఆడటం అనుమానమేనని ఊహాగానాలు వినిపించాయి.

గాయం నుంచి పూర్తిగా

గాయం నుంచి పూర్తిగా

కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. సెంచరీతో చెలరేగి ఫామ్ అందుకున్నాడు. దాంతో అతని గాయంపై జరగిన ప్రచారాలన్నీ అవాస్తవాలేనని స్పష్టమైంది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వస్తున్నానని వార్నరే స్వయంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్‌ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ విషయాన్ని అతనే తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పంచుకున్నాడు.

కోల్‌కతాతో ఢీ..

కోల్‌కతాతో ఢీ..

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్‌ను మినహాయించారు. చెన్నై వేదికగా జరిగే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Wednesday, March 31, 2021, 17:10 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X