For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH బ్యాటర్ విధ్వంసం!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(96 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్స్‌లతో 170) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ..సౌరాష్ట్రతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

96 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(95 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 125) సెంచరీతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 424 పరుగుల భారీ స్కోర్ చేసింది.

SRH s Abhishek Sharma Prabhsimran Singh Create History In Vijay Hazare Trophy

అన్మోల్ మల్హోత్రా(45 బంతుల్లో 6 ఫోర్లతో 48 నాటౌట్), సన్వీర్ సింగ్(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) దూకుడుగా ఆడారు. సౌరాష్ట్ర బౌలర్లలో ప్రణవ్ కరియా 4 వికెట్లు తీయగా.. ధర్మెంద్ర సిన్హా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులకు కుప్పకూలింది.

అర్పిత్ వసవడ(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) సెంచరీతో రాణించగా.. హర్విక్ దేశాయ్(33 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్వీర్ సింగ్(3/37) మూడు వికెట్లు తీయగా.. బల్తేజ్ సింగ్(2/59), రఘు శర్మ(2/51) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, నమన్ ధీర్ తలో వికెట్ తీసారు.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అభిషేక్ శర్మ 298 పరుగుల రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2022లో బెంగాల్‌కు చెందిన సుదీప్-అభిమన్యు ఈశ్వరన్ 298 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Story first published: Tuesday, December 31, 2024, 18:25 [IST]
Other articles published on Dec 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+