Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: తొలి ఓటమి శుభ సూచకమే.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సన్‌రైజర్స్‌దే టైటిల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ ఊహించని పరాజయంతో ఆరెంజ్ ఆర్మీపై అభిమానులు ఆశలు వదులుకున్నారు. కనీస పోటీ ఇవ్వలేక బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ వంటీ కీలక ఆటగాళ్లు లేకుండా సన్‌రైజర్స్ తొలి మ్యాచ్ ఆడింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం ఆడనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌ అందుబాటులోకి వచ్చారు. నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన నేపథ్యంలో ఈ ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆలస్యంగా భార‌త్‌కు వచ్చారు. ఆదివారమే ఈ సిరీస్ ముగియడంతో భారత్‌కు వచ్చిన ఈ సఫారీ త్రయం.. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసింది. లక్నోతో మ్యాచ్ కోసం ముమ్మరంగా సాధన కూడా చేస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన ఎయిడెన్ మార్క్‌రమ్ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాడు.

 SRH will win IPL 2023 if IPL 2016 season sentiment repeats

అయితే ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఓ సెంటిమెంట్ ఊరిస్తోంది. ఆ సెంటిమెంట్ గనుక రిపీట్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఛాంపియన్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే..? 2016 సీజన్‌లో తొలిసారి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతకుముందు రెండు సీజన్లలో 2014, 2015 సీజన్లలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. వరుస సీజన్లలో ఆరో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. 2016లో మాత్రం టైటిల్ గెలిచింది.

ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్.. గత సీజన్‌లోనూ 8వ స్థానంతోనే సరిపెట్టుకుంది. దాంతో 2016 సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ సారి సన్‌రైజర్స్ టైటిల్ గెలుస్తోంది. ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

అంతేకాకుండా 2009లో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ అయిన డెక్కన్ చార్జెస్ టైటిల్ గెలిస్తే మరో ఏడేళ్లకు 2016లో సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిందని, మళ్లీ ఏడేళ్లకు అంటే తాజా సీజన్‌లోనూ సన్‌రైజర్స్ విజేతగా నిలుస్తుందని మరో సెంటిమెంట్‌ను అభిమానులు పంచుకుంటున్నారు. అంతేకాకుండా 2016, 2023 సీజన్‌లో హైదరాబాద్.. లీగ్ నాలుగో పోరును తొలి మ్యాచ్‌గా ఆడి.. 200 పరుగుల లక్ష్యాన్ని చేధించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రతీ సీజన్‌లో ఇలా అభిమానులు తమకిష్టమైన ఫ్రాంచైజీలకు చెందిన సెంటిమెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ ఆశలు పెంచుకోవడం సర్వసాధారణం.

Story first published: Tuesday, April 4, 2023, 22:26 [IST]
Other articles published on Apr 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+