
హీరోలా ఫ్లైయింగ్ కిస్..
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌ను యుజ్వేందర్ చాహల్ అద్భుతంగా ఆరంభించాడు. గత సీజన్ వరకు ఆర్‌సీబీకి ఆడిన అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున తన ప్రయాణాన్ని గొప్పగా మొదలుపెట్టాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చాహల్ తన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే గ్యాలరీలో ఉన్న తన సతీమణి ధనశ్రీ వర్మకు హీరోలా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక ఈ మూమెంట్‌కు ఫిదా అయిన ధనశ్రీ.. గంతులేస్తూ తన మొబైల్‌తో చాహల్‌ని ఫొటొ తీసుకుంది.
ధన శ్రీ స్పెషల్ అట్రాక్షన్..
చాహల్ మ్యాచ్ ఆడుతుంటే చూసేందుకు వచ్చిన అతని భార్య ధనశ్రీ వర్మ కూడా.. స్టేడియంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ రాజస్థాన్ టీమ్‌ను ప్రోత్సహించింది. దాంతో.. వికెట్ పడగొట్టిన ప్రతిసారి ఆమె వైపు చూస్తూ చాహల్.. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. 2020, డిసెంబరు 22న ధనశ్రీ వర్మను చాహల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొరియోగ్రాఫర్, యూట్యూబర్ కూడా. అప్పుడప్పుడు ఆమెతో కలిసి చాహల్ కూడా డ్యాన్స్ చేస్తూ.. వీడియోలు షేర్ చేస్తుంటాడు. మంగళవారం మ్యాచ్‌లో ధనశ్రీ వర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

చాహల్ తీన్మార్..
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చాహల్ కేవలం 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో పాటు పవర్ హిట్టర్ అబ్దుల్ సమద్ (4)లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆఖర్లో భారీ సిక్సర్లు కొట్టిన రొమారియో షెఫర్డ్ (24) కూడా చాహల్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన రాజస్థాన్ రాయల్స్.. 61 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కెప్టెన్ సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41)పరుగుల విధ్వంసం సృష్టించగా..జోస్ బట్లర్(35), షిమ్రాన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) విలువైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.

మార్క్‌రమ్ మినహా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), రొమారియో(18 బంతుల్లో 2 సిక్స్‌లతో 24)మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications
