Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Qualifier 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే..?

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే క్వాలిఫయర్-2లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

ఓవైపు కేకేఆర్‌తో క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవ్వగా.. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెపాక్ మైదానానికి తగ్గట్లుగా రాజస్థాన్ రాయల్స్‌లో అద్భుత స్పిన్నర్లు ఉన్నారు. లోకల్ భాయ్ అశ్విన్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్‌ను ఎదుర్కోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ ఛాలెంజ్.

SRH vs RR What Sunrisers Hyderabad need to beat Rajasthan Royals in IPL 2024 Qualifier 2

'ట్రావిషేక్‌'పైనే భారం
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థాయికి మించిన ప్రదర్శన చేయాలి. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సత్తా చాటడం కీలకం. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో ఈ ఇద్దరే కీలక పాత్ర పోషించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డ్ విజయాలు అందించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్(533, అభిషేక్ శర్మలే(470) టాప్ స్కోరర్లుగా కొనసాగుతున్నారు.

చాహల్, బౌల్ట్, అశ్విన్ వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్ చేయాలంటే ఈ ఓపెనింగ్ జోడీ రాణించాల్సిందే. ఈ ఇద్దరితో పాటు హెన్రీచ్ క్లాసెన్(413) సత్తా చాటితే సన్‌రైజర్స్‌కు తిరుగు ఉండదు. రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డిలు తమ జోరును కొనసాగించాల్సి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 76* పరుగులతో సత్తా చాటాడు. మరోసారి అతను అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తే సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు తిరుగుండదు.

SRH vs RR What Sunrisers Hyderabad need to beat Rajasthan Royals in IPL 2024 Qualifier 2

బౌలింగ్‌లోనూ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ రాణిస్తున్నా ఇతర బౌలర్లను నుంచి సహకారం లభించడం లేదు. వానిందు హసరంగా స్థానంలో జట్టులోకి వచ్చిన విజయకాంత్ వియాస్కంత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అతని స్థానంలో గ్లేన్ ఫిలిప్స్‌ను తీసుకోవడం ఉత్తమం. సన్వీర్ సింగ్‌కు బదులు జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడిస్తే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ బలం పెరుగుతోంది.

పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ డేంజరస్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌లను ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగడం చాలా ముఖ్యం.

Story first published: Thursday, May 23, 2024, 18:59 [IST]
Other articles published on May 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+