Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: థర్డ్ అంపైర్ ఘోర తప్పిదం.. సోషల్ మీడియాలో దుమారం! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో అంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన 50వ లీగ్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ రోహన్ పండిట్ బ్లండర్ మిస్టేక్ చేశాడు. అతని తప్పిదం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

రనౌట్ విషయంలో జరిగిన ఈ తప్పిదంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. అంపైర్లు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి ట్రావిస్ హెడ్..రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్ బ్యాలెన్స్ కోల్పోయాడు.

SRH vs RR Travis Head Survives Controversial Run-Out Scare Before Being Dismissed The Next Ball

బ్యాట్‌ను మిస్సైన బంతిని అందుకున్న సంజూ శాంసన్ అంతే వేగంగా వికెట్లను కొట్టాడు. అప్పటికే అప్రమత్తమైన ట్రావిస్ హెడ్ బ్యాట్‌ను క్రీజులో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా వికెట్లను తాకడంతో రాజస్థాన్ ఆటగాళ్లు రనౌట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ రోహన్ పండిట్.. నాటౌట్ ఇచ్చాడు.

దాంతో అంతా అవాక్కయ్యారు. రీప్లేలో బ్యాట్ క్రీజులో పెట్టలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నా.. థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర.. ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ మరుసటి బంతికే ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ కావడంతో అంతా సైలెంట్ అయ్యారు. లేకుంటే ఈ తప్పిదంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు థర్డ్ అంపైర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది.

ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, May 2, 2024, 21:42 [IST]
Other articles published on May 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+