
పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్లనే విజయం వరించింది. దాంతో సన్‌రైజర్స్ విజయం కూడా ఖాయమని తెలుగు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరెంజ్ జ్యూస్ పిండుతామని కవ్వింపులకు దిగిన ఆర్‌ఆర్.. ఇప్పుడు జ్యూస్ పిసుక్కోవాల్సిందేనని సెటైర్లు పేల్చుతున్నారు.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి కేన్ మామ(కేన్ విలియమ్సన్).. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విపరీతమైన డ్యూ ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. బ్రియాన్ లారా, ముత్తయ్య మురళీ దరన్, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాల పర్యవేక్షణలో గత 10 రోజులుగా సంసిద్దమయిన తాము ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. ఇక అంతా ఊహించిన జట్టుతోనే సన్‌రైజర్స్ బరిలోకి దిగింది. వాష్టింగ్ సుందర్‌కు తోడు మరో పేస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌తో సన్‌రైజర్స్ ఆడుతోంది. భువీ, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గ్రీన్ వికెట్ కావడంతో పేసర్లకు పిచ్ అనుకూలించనుంది.
తమ జట్టు తరఫున కొత్తగా ఏడుగురు అరంగేట్రం చేస్తున్నారని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. జోస్ బట్లర్, హెట్‌మైర్, ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్ నీల్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్‌ఆర్‌హెచ్ చాలా బలహీనంగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగనుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఎదురెదురుపడిన 15 సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది సార్లు, గులాబీ దళం ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్.
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్‌నీల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్.