
పుణే: ఐపీఎల్ 2022 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పోటాపడి పరుగులిచ్చుకున్నారు. దాంతో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 211 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఈ ఇద్దరితో పాటు జోస్ బట్లర్(35), షిమ్రాన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) విలువైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), యశస్వీ జైస్వాల్(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మంచి శుభారంభం అందించారు. తొలి ఓవర్‌లో నోబాల్ రూపంలో లభించిన లైఫ్‌తో బట్లర్ చెలరేగాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం రొమారియో షెఫర్డ్... జైస్వాల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ క్రీజులోకి రాగా.. బౌండరీలతో జోరు కనబర్చిన జోస్ బట్లర్‌ను ఉమ్రాన్ మాలిక్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. కేన్ మామ రివ్యూకెళ్లి ఫలితం రాబట్టాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో సంజూ శాంసన్ ధాటిగా ఆడాడు. భారీ సిక్స్‌లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే సంజూను భువనేశ్వర్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ బ్యాటింగ్ జోరు మాత్రం ఆగలేదు. రియాన్ పరాగ్(12), షిమ్రాన్ హెట్‌మైర్ భారీ షాట్లతో స్కోర్ బోర్డును 200 ధాటించారు.