For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RR: పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం!

 SRH vs RR: Rajasthan Royals kick-off season with commanding win over Sunrisers Hyderabad

పుణే: ఏదయితే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. ఘోర పరాజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఐపీఎల్ 2022 సీజన్‌ను ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్‌తో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.

కెప్టెన్ సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41)పరుగుల విధ్వంసం సృష్టించగా..
జోస్ బట్లర్(35), షిమ్రాన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) విలువైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.

అంతా సింగిల్ డిజిటే..

అంతా సింగిల్ డిజిటే..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), రొమారియో(18 బంతుల్లో 2 సిక్స్‌లతో 24)మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఆరంభంలోనే గట్టి షాక్..

ఆరంభంలోనే గట్టి షాక్..

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రాజస్థాన్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తన ఫస్ట్ ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్‌గా వచ్చిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(2), రాహుల్ త్రిపాఠి(0) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ఎన్నో ఆశలు పెట్టుకున్న నికోలస్ పూరన్(0) సైతం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇందులో బ్యాటర్ కొట్టిన ఒక్క బౌండరీ లేకపోవడం గమనార్హం. బై రూపంలోనే నాలుగు పరుగులు వచ్చాయి.

పెవిలియన్‌కు క్యూ..

పెవిలియన్‌కు క్యూ..

ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌ను కాదని రూ.6.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అభిషేక్ శర్మ(9) సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. అబ్దుల్ సమద్(4) కూడా విఫలమవడంతో 37 పరుగులకే సన్‌రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఎయిడెన్ మార్క్‌రమ్, రొమారియో(24) జట్టు గౌరవం కాపాడే ప్రయత్నం చేశారు. భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని చాహల్ విడదీసాడు. రొమారియోను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 పరువు కాపాడిన మార్క్‌రమ్..

పరువు కాపాడిన మార్క్‌రమ్..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో మార్కరమ్ చెలరేగాడు. సుందర్ సైతం భారీ షాట్లు కొట్టడంతో సన్‌రైజర్స్ 100 పరుగుల మార్క్‌ను ధాటింది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన సుందర్‌ను బౌల్ట్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మార్కర్‌మ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు.

,

Story first published: Tuesday, March 29, 2022, 23:37 [IST]
Other articles published on Mar 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+