Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR:ఆరెంజ్ జ్యూస్‌తో పుండు మీద కారం చల్లేలా ఆర్‌ఆర్ ట్వీట్.. రగిలిపోతున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్!

 SRH vs RR: Rajastan Royals troll Sunrisers Hyderabad with Orange Juice

పుణే: సీజన్లు మారుతున్నా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కొత్త ప్లేయర్లతో సరికొత్తగా బరిలోకి దిగినా.. 15వ సీజన్‌ను ఘోర పరాజయంతో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కేన్ సేన 61 రన్స్‌తో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్ సోషల్ మీడియా వేదికగా దారుణ ట్రోలింగ్‌కు గురైంది. సొంత అభిమానులతో పాటు టీమ్ హేటర్స్.. సన్‌రైజర్స్ ఆటగాళ్లను, మేనేజ్‌మెంట్‌ను ఓ ఆట ఆడుకున్నారు. అయితే, ఇదంతా ఒక ఎత్తయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌ను పుండు మీద కారం చల్లినట్లు రాజస్థాన్ రాయల్స్ ఆరెంజ్ జ్యూస్‌తో ట్రోల్ చేసింది. దీనిని సన్‌రైజర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మంగళవారం ఉదయం ఆరెంజ్ జ్యూస్ ఫొటోను ట్వీట్ చేసిన ఆర్‌ఆర్ అడ్మిన్.. గుడ్ మార్నింగ్ అంటూ సన్‌రైజర్స్‌కు ట్యాగ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కవ్వించే ప్రయత్నం చేశాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్ల జ్యూస్‌ను పిండేస్తామని పరోక్షంగా హెచ్చరించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఆరెంజ్ జ్యూస్ తాగేసిన గ్లాస్‌ ఫొటోను ట్వీట్ చేసి గుడ్ నైట్ చెప్పాడు. సన్‌రైజర్స్ ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ జ్యూస్ పిండేసామని ఎగతాళి చేశాడు. ఇక ఈ ట్వీట్‌‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొడుకా గుర్తు పెట్టుకో..

ఈ ట్రోల్ హిలేరియస్‌గా ఉందని కొంతమంది నెటిజన్లు నవ్వుకుంటుంటే.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్‌పై రగలిపోతున్నారు. 'మాకూ టైం వస్తుంది.. అప్పుడు చూపిస్తామంటూ' అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. పవన్ కల్యాణ్ లెటెస్ట్ మూవీ డైలాగ్‌ 'కొడుకా గుర్తు పెట్టుకో నిన్ను వదిలేది లేదు'తో ఆర్‌ఆర్ అడ్మిన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరు నెటిజన్స్ అయితే రాకేశ్ మాస్టర్ ఆరెంజ్ జ్యూస్ పట్టుకుని ఏడుస్తూ ఉన్న మీమ్స్‌తో బదులిస్తున్నారు.

గత సీజన్‌లో కూడా..

గతంలో కూడా ఆర్‌ఆర్‌.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ముందు ఇలాంటి పోస్టే చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 2020 సీజన్‌ రెండో మ్యాచ్‌కు ముందు 'ఈ రాత్రికి హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేయాలి'అంటూ పోస్టు చేసింది. అయితే, ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ కొట్టిన దెబ్బకు రాజస్థాన్ రాయల్స్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ ఓటమి తర్వాత సన్‌రైజర్స్ కూడా తమదైన శైలిలో బదులిచ్చింది. ఇప్పుడు చేద్దామా బిర్యానీ ఆర్డర్ అంటూ కౌంటరిచ్చింది.

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే స్థానం నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

Story first published: Wednesday, March 30, 2022, 18:31 [IST]
Other articles published on Mar 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+