Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: డై హార్డ్ ఫ్యాన్స్.. అందుకే అరుస్తున్నారు: ప్యాట్ కమిన్స్ (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చిందని, తమకు విజయాలు కూడా దక్కాయని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. దాంతోనే ఈ మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగానే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తాము ముందుగా బౌలింగ్ చేసి ఓటమిపాలయ్యామని, దాంతోనే తాజా నిర్ణయంతో ఫ్యాన్స్ అంతా ఉత్సాహానికి లోనవుతున్నారని కమిన్స్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం తమ అతిపెద్ద బలమని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు.

SRH vs RR Pat Cummins Says the crowd is pretty excited about them batting first in 50th IPL match

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఈ పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ సీజన్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ మూమెంటమ్‌ను కొనసాగించడం చాలా ముఖ్యం. చాలా విషయాలు మాకు అనుకూలంగానే ఉన్నాయి. మాకు వర్కౌట్ అయిన ప్రణాళికలకే కట్టుబడి ఉన్నాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పోవెల్, షిమ్రన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్

Story first published: Thursday, May 2, 2024, 19:23 [IST]
Other articles published on May 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+