Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: తెలుగోడి విధ్వంసం.. 8 సిక్సర్లతో వీర విహారం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది.

హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

SRH vs RR Nitish Kumar Reddy 76 helps Sunrisers Hyderabad Post 201 3

లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తమ ఇన్నింగ్స్‌ను చాలా నెమ్మదిగా మొదలుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. ఇక ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో అభిషేక్ శర్మ(12) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే అన్‌మోల్ ప్రీత్ సింగ్(5)ను సందీప్ శర్మ పెవిలియన్ చేర్చాడు.

దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 37 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇదే లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 9వ ఓవర్‌లో బ్యాట్‌కు పనిచెప్పిన ట్రావిస్ హెడ్.. వరుసగా 6, 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు.

SRH vs RR Nitish Kumar Reddy 76 helps Sunrisers Hyderabad Post 201 3

అంపైర్ ఘోర తప్పిదం..
నితీష్ రెడ్డి సైతం సిక్సర్లు బాదడంతో సన్‌రైజర్స్ స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన 12వ ఓవర్‌లో ఫోర్‌తో పాటు క్విక్ సింగిల్ తీసిన ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రెండు బౌండరీలు బాదిన నితీష్ రెడ్డి 21 పరుగులు పిండుకున్నాడు.

ఆవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఓవర్ మూడో బంతికి ట్రావిస్ హెడ్.. అంపైర్ తప్పిదం కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడే క్రమంలో ట్రావిస్ హెడ్ బ్యాలెన్స్ కోల్పోయాడు. బంతిని అందుకున్న సంజూ శాంసన్ వికెట్లను కొట్టాడు.

సమీక్షలో థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. కానీ రిప్లేలో బ్యాట్‌ క్రీజులో పెట్టినట్లు కనిపించలేదు. ఆ మరుసటి బంతికే ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి హెన్రీచ్ క్లాసెన్ రాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం నితీశ్ రెడ్డి దూకుడుగా ఆడగా.. హెన్రీచ్ క్లాసెన్ సైతం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

Story first published: Thursday, May 2, 2024, 21:19 [IST]
Other articles published on May 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+