Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: ఇంపాక్ట్ ప్లేయర్‌గా జాంపండు‌.. ఆరెంజ్ ఆర్మీదే బ్యాటింగ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ తాత్కలిక సారథి రియాన్ పరాగ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా పొడిగా కనిపిస్తోంది. వికెట్‌‌కు తగ్గట్లు ఆడుతాం. 17 ఏళ్ల వయసు నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నాను. కెప్టెన్సీ బాధ్యతలను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇంపాక్ట్ రూల్ సంజూ‌కు కలిసి రానుంది. తీక్షణ, జోఫ్రా, ఫరూకీ బరిలోకి దిగుతున్నారు. శుభారంభం చేయడం ఎప్పుడూ మంచిదే. ఇప్పటికే మేం చాలా ప్రాక్టీస్ చేశాం.'అని రియాన్ పరాగ్ తెలిపాడు.

SRH vs RR IPL 2025 Rajasthan Royals opt to field in Hyderabad
Photo Credit: IPL twitter

ఉప్పల్‌‌లో తిరిగి ఆడటం చాలా సంతోషంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'టీమ్ కోర్ గ్రూప్, కోచింగ్ స్టాఫ్ మారలేదు. ముందుగా బౌలింగ్, బ్యాటింగ్ చేయడం ముఖ్యమని భావించడం లేదు. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంది. కాబట్టి సెకండ్ బౌలింగ్ చేయడంపై ఆందోళన అవసరం లేదు. గత సీజన్ ఫామ్‌ను కొనసాగించాలనుకుంటున్నాం. మేం స్వేచ్చగా ఆడుతూ ఆటను ఆస్వాదిస్తాం. అభి, హెడ్ గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నితీష్, క్లాసెన్ కూడా జట్టులోనే ఉన్నారు. ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ కొత్తగా జట్టుతో కలిసారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లకు సన్‌రైజర్స్ తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆడమ్ జంపా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది.

తుది జట్లు
సన్‌రైజర్స్‌: ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హెన్రిచ్‌ క్లాసెన్, నితీశ్‌కుమార్‌ రెడ్డి, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌),సిమర్జీత్ సింగ్, హర్షల్‌ పటేల్, మహ్మద్‌ షమి, జైదేవ్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హాక్ ఫరూఖీ.

Story first published: Sunday, March 23, 2025, 15:25 [IST]
Other articles published on Mar 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+