Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డ్!

రాజస్థాన్ రాయల్స్ పేసర్ జో ఫ్రా ఆర్చర్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఈ క్రమంలో అతను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ చెత్త రికార్డ్‌ను అధిగమించాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ శర్మ 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డ్‌గా ఉండగా.. జోఫ్రా ఆర్చర్ బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఉప్పల్ వికెట్‌పై జోఫ్రా ఆర్చర్ పూర్తిగా తేలిపోయాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో జోఫ్రా ఆర్చర్, మోహిత్ శర్మతో పాటు బసిల్ థంపి, యశ్ దయాల్, రీస్ టోప్లీ, లూక్ వుడ్ ఉన్నారు.

SRH vs RR IPL 2025 Jofra Archer bowled the most expensive spell in IPL history

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు

0/76-జోఫ్రా ఆర్చర్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, 2025

0/73-మోహిత్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్, 2024

0/70-బసిల్ థంపి vs ఆర్‌సీబీ, 2018

0/69-యశ్ దయాల్ వర్సెస్ కేకేఆర్, 2023

1/68-రీస్ టోప్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్, 2024

1/68-లూక్ వుడ్ వర్సెస్ ఢిల్లీ, 2024

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) పరుగుల సునామీ సృష్టించాడు. నితీష్ కుమార్ రెడ్డి(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ(2/52) రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(3/38) మూడు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 34 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదయ్యాయి.

Story first published: Sunday, March 23, 2025, 17:52 [IST]
Other articles published on Mar 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+