ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) పరుగుల సునామీ సృష్టించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌కు అండగా నితీష్ కుమార్ రెడ్డి(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ(2/52) రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(3/44) మూడు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 34 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదయ్యాయి.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి ఓవర్ నుంచే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. ఆరంభంలో కాస్త స్లోగా ఆడిన ట్రావిస్ హెడ్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అభిషేక్ శర్మ(24)ను మహీష్ తీక్షణ ఔట్ చేసినా.. ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతను కొట్టిన 105 మీటర్ల భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి 94 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ట్రావిస్ హెడ్, ఇషాన్ హాఫ్ సెంచరీ..
పవర్ ప్లే అనంతరం కూడా ఇదే దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో డేంజరస్‌గా మారిన ట్రావిస్ హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ట్రావిస్ హెడ్ ఔటైనా.. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో పాటు బౌండరీలతో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఈ క్రమంలో అతను 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి సైతం క్లాసిక్ షాట్స్‌తో అలరించాడు. దాంతో 14.1 ఓవర్లలోనే ఆరెంజ్ ఆర్మీ 200 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ సెంచరీ..
ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడే క్రమంలో తీక్షణ బౌలింగ్‌లో నితీష్(30) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 72 పరుగుల పార్టనర్‌షిప్‌కు బ్రేక్ పడింది. క్రీజులోకి వచ్చిన క్లాసెన్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కాటేరమ్మ కొడుకు తరహాలో రాజస్థాన్ బౌలర్లపై రెచ్చిపోయాడు. దాంతో సన్‌రైజర్స్ 17.4 ఓవర్లలోనే 250 పరుగుల మార్క్ అందుకుంది. క్లాసెన్ కాక క్యాచ్ ఔటైనా.. ఇషాన్ కిషన్ వరుసగా రెండు సిక్సర్లు బాది 44 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ. తుషార్ దేశ్ పాండే వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని సిక్సర్ కొట్టిన అనికేత్ వర్మ.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అభినవ్ మనోహర్ గోల్డెన్ డక్ అవ్వగా.. ఇషాన్ బౌండరీతో ఇన్నింగ్స్‌ను ముగించాడు.
𝙏𝙝𝙖𝙩 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 #TATAIPL 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🧡
— IndianPremierLeague (@IPL) March 23, 2025
A special first for Ishan Kishan as he brought up his 💯 off just 45 balls 🔥
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK