For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RR: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ సెంచరీ సాధించడం విశేషం. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లోనూ అతనికి ఇదే తొలి సెంచరీ.

విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ కిషన్.. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. మరో 20 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్పటి వరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే శతకాలు సాధించారు. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్‌లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు.

SRH vs RR IPL 2025 Ishan Kishan Creates History with First IPL Ton by an Indian for SRH

రూ.11.25 కోట్లతో..
ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ డబ్బులకు తొలి మ్యాచ్ నుంచే ఇషాన్ కిషన్ న్యాయం చేస్తున్నాడు. అతనికి ఇది మూడో ఫ్రాంచైజీ. గుజరాత్ లయన్స్ తరఫున 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. 2017 వరకు ఆ జట్టులో కొనసాగాడు. 2018లో ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లిన అతను.. 2024 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు.

అద్భుత ప్రదర్శనతో 2021లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. కానీ అతనికి అవకాశాలు పెద్దగా రాలేదు. 2023లో సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే తప్పుకున్న ఇషాన్ కిషన్.. మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేదు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో కొనసాగిన అతను ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

సన్‌రైజర్స్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67), నితీష్ కుమార్ రెడ్డి(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ(2/52) రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(3/38) మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్. గత సీజన్‌లో ఆర్‌సీబీతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ 287 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా కొనసాగుతోంది.

Story first published: Sunday, March 23, 2025, 18:27 [IST]
Other articles published on Mar 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+