Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచిన మార్క్‌రమ్, అబ్దుల్ సమద్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 176 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. ట్రెంట్ బౌల్ట్(3/45) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది.

హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌, ఆవేశ్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు..

SRH vs RR IPL 2024 Qualifier-2 Trent Boult helps Hyderabad finish at 175 9

ఎయిడెన్ మార్క్‌రమ్(1), అబ్దుల్ సమద్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ముగ్గురు షార్ట్ థర్డ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటవ్వడం విశేషం.

దెబ్బతీసిన బౌల్ట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ(12) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాంతో నాలుగు ఓవర్లలోనే సన్‌రైజర్స్ 50 పరుగుల మార్క్‌ను అందుకుంది.

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో 6, 4 బాది జోరు కనబర్చిన రాహుల్ త్రిపాఠి.. అదే జోరులో అప్పర్ కట్ ఆడబోయి షార్ట్ థర్డ్‌లో చాహల్‌కు చిక్కాడు. అదే ఓవర్ చివరి బంతికి మార్క్‌రమ్(1) కూడా చాహల్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 68 పరుగులు చేసింది.

కొంపముంచిన సమద్..
క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఆచితూచి ఆడాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించిన అతను.. హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ సందీప్ శర్మ అతన్ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు. ఆ కొద్దిసేపటికే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి(5) ర్యాంప్ షాట్ ఆడబోయి షార్ట్ థర్డ్‌లో చాహల్‌కు చిక్కాడు. ఆ మరుసటి బంతికే అబ్దుల్ సమద్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో షెహ్‌బాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించగా.. హెన్రీచ్ క్లాసెన్ ఆచితూచి ఆడాడు. వరుస వికెట్లు కోల్పోవడంతో ఈ జోడీ డిఫెన్స్‌కు పరిమితమైంది. క్రీజులో కుదురుకున్న అనంతరం క్లాసెన్ భారీ సిక్స్‌ల సాయంతో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సందీప్ శర్మ సూపర్ యార్కర్‌తో క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 19వ ఓవర్‌లో సందీప్ శర్మ 6 పరుగులే ఇవ్వగా.. ఆవేఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో షెహ్‌బాజ్ అహ్మద్(18) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఉనాద్కత్ బౌండరీ బాది ఆఖరి బంతికి రనౌటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 175 పరుగులకే పరిమితమైంది.

Story first published: Friday, May 24, 2024, 21:27 [IST]
Other articles published on May 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+