Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: ఐపీఎల్‌లోకి నయా స్టార్.. సన్‌రైజర్స్ ఆశాదీపం అరంగేట్రం!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. ఆరంభంలో బంతి ఆగి వచ్చే అవకాశం ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కలిక కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. చేజింగ్‌లో అడ్వాంటేజ్ వాడుకుంటామని తెలిపాడు.

సారథ్య బాధ్యతలు దక్కడంపై స్పందిస్తూ.. ఈసారి ఒక్క మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నానని చెప్పాడు. సాయశక్తులా జట్టు విజయం కోసం కృషి చేస్తామని తెలిపాడు. ఫజలక్ ఫరూఖీ, హరీ బ్రూక్, ఆదిల్ రషీద్, గ్లేన్ ఫిలిప్స్.. తమ ఓవర్‌సీస్ ఆటగాళ్లని చెప్పుకొచ్చాడు.

Image Credit: Twitter/StarSportsTelugu

కొత్త రూల్స్‌తో ఐపీఎల్ కొత్తగా మారిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ప్రత్యర్థిని గౌరవిస్తూ తమ బలాలకు తగ్గట్లు ఆడుతామని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించడం ఎప్పుడూ గొప్పగా ఉంటుందని, జైపూర్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు. సంగాక్కరతో తకు మంచి అనుబంధం ఉందని చెప్పిన సంజూ శాంసన్.. మ్యాచ్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని చర్చిస్తామని తెలిపాడు. జోస్ బట్లర్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్‌మైర్ తమ ఓవర్‌సీస్ ఆటగాళ్లని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ హరీ బ్రూక్ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో హరీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. హరీ బ్రూక్‌పై ఆరెంజ్ ఆర్మీ భారీ ఆశలు పెట్టుకుంది.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హరీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లేన్ ఫిలిప్స్(కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), టీ నటరాజన్, ఫజలక్ ఫరూకీ

Story first published: Sunday, April 2, 2023, 15:30 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+