Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: రూ.13 కోట్లు.. 13 పరుగులు! ఇదేం కర్మరా అయ్యా.. అంతా తుక్ తుక్‌గాళ్లే ఉన్నారు!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇదేం కర్మరా అంటూ ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు. రూ.13.25 కోట్ల భారీ ధరతో తీసుకున్న హరీ బ్రూక్(13) కూడా తీవ్రంగా నిరాశపర్చడంతో సన్‌రైజర్స్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

పేలవ బౌలింగ్‌తో ధారళంగా పరుగిలిచ్చిన సన్‌రైజర్స్ కనీసం బ్యాటింగ్‌‌లోనైనా అలరిస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ కాగా.. జాసన్ హోల్డర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో రాహుల్ త్రిపాఠి వెనుదిరిగాడు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి అభిషేర్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌల్ట్ వేసిన యార్కర్‌ను అంచనా వేయలేక మూల్యం చెల్లించుకున్నాడు.

SRH vs RR: Fans slams Harry Brook for his poor performance in debut IPL Match

క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి..నాలుగో బంతిని డాట్ చేశాడు. ఐదో బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లగా.. హోల్డర్ అద్భుతంగా అందుకున్నాడు. తర్వాత బంతిని బ్రూక్ డాట్ చేయడంతో తొలి ఓవర్ మెయిడిన్ అయ్యింది. దాంతో డబుల్ వికెట్ మెయిడిన్ ఓవర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో పడింది. క్రీజులోకి వచ్చిన రూ.13.25 కోట్ల ప్లేయర్, సన్‌రైజర్స్ ఆశాదీపం హరీ బ్రూక్ అయినా రాణిస్తాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హరీ బ్రూక్(13), అభిషేక్ శర్మ(0)లను ట్విటర్ వేదికగా ఏకీ పారేస్తున్నారు. బ్రూక్.. కోటికి ఒక పరుగు చెప్పిన 13 పరుగులు చేశాడని, అంతా తుక్ తుక్ ఆటగాళ్లే ఉన్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక అభిషేక్ శర్మ ఓవర్ రేటేడ్ ప్లేయరని, అతను రాణించిందేం లేకున్నా జట్టులో కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. అభిషేక్ శర్మ కోసం డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ప్లేయర్‌ను వదులుకున్నారని, రూ.6 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్నారని మండిపడుతున్నారు. ఈ తరహా ప్రదర్శనతో టైటిల్ దేవుడేరుగు.. ప్లే ఆఫ్స్ చేరినా గొప్పేనని నిట్టూరుస్తున్నారు.

Story first published: Sunday, April 2, 2023, 18:34 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+