Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: రాజస్థాన్‌దే బ్యాటింగ్! సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో భారీ మార్పులు! ‘జాతిరత్నాల’పై వేటు!

Chris Morris returns as Rajasthan bat, Hyderabad drop David Warner

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. యువ పేసర్ కార్తీక్ త్యాగీ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని షంసీ, మిల్లర్ స్థానాల్లో క్రిస్ మోరీస్, లూయిస్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. త్యాగీ ప్లేస్‌లో జయదేవ్ ఉనాద్కట్ వచ్చాడు.

హైదరాబాద్ జట్టులో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇక యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం ఇచ్చారు. సీనియర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే,కేదార్ జాదవ్‌తో పాటు ఖలీల్ అహ్మద్ వేటుకు గురయ్యారు.

లీగ్‌లో 9 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. పరువు కోసం పాకులాడుతుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్తానంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా విజయం సాధించి గౌరవంగా లీగ్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆరో ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే లీగ్‌లో మిగిలిన ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఆ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో సన్‌రైజర్స్‌ను రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

తుదిజట్లు

​సన్‌రైజర్స్ హైదరాబాద్:
జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియమ్ గార్గే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్

రాజస్థాన్ రాయల్స్:
ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, లియమ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనాద్కట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Story first published: Monday, September 27, 2021, 19:21 [IST]
Other articles published on Sep 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+