Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: అనసూయ అరుపులు.. సన్‌రైజర్స్ మెరుపులు!(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో టాలీవుడ్ హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైన అనసూయ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపింది.

మ్యాచ్ ఆసాంతం గ్యాలరీలో సందడి చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడినప్పుడు ఎగిరి గంతేసిన అనసూయ.. క్యాచ్‌లు వదిలేసినప్పుడు అయ్యో అంటూ బాధపడింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ సిక్స్ కొట్టగా.. లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు ప్రయత్నించినా అందలేదు. దాంతో అనసూయ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.

Anasuya Bharadwaj

అనసూయతో పాటు శ్రీముఖి, వర్షిణి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్నందుకుంది.

రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు చివరి బంతికి 2 పరుగులు అవసరమవ్వగా.. భువనేశ్వర్ కుమార్ స్టన్నింగ్ డెలివరీతో వికెట్ తీసి సంచలన విజయాన్ని అందించాడు. ఈ గెలుపు నేపథ్యంలో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మైదానంలో అనసూయ అరుపులు.. సన్‌రైజర్స్ మెరుపులు అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది.

యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), రియాన్ పరాగ్(49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నటరాజన్ రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Friday, May 3, 2024, 0:11 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+