

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ ఘోర తప్పిదం చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతి కేన్ మామ బ్యాట్ ఎడ్జ్ తీసుకోని కీపర్ వైపు దూసుకెళ్లగా.. సంజూ శాంసన్ సూపర్ డైవ్‌తో అందుకునే ప్రయత్నం చేశాడు.
అయితే బంతిని శాంసన్ సరిగ్గా అంచనా వేయకపోవడంతో గ్లోవ్స్‌కు తగిలి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ వైపు వెళ్లింది. దాంతో అలర్ట్ అయిన పడిక్కల్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో అది నేలకు తాకినట్లు అనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్షను కోరాడు. రిప్లేలో సైతం బంతి నేలకు తాకినట్లు కనిపించింది. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(0) డకౌట్‌గా వెనుదిరగడంతో సన్‌రైజర్స్.. 7 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది.
ఇక థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. బంతి నేలకు తాకినట్లు అంత స్పష్టంగా కనబడుతుంటే ఔట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అంపైర్‌ది అత్యంత చెత్త నిర్ణయమని, రిప్లేను మరోసారి పరిశీలించకుండానే ఔటిచ్చాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పడిక్కల్ చేతి వేళ్లు బంతి కింద కూడా లేవని, బాల్ నేలకు తాకినట్లు స్పష్టంగా కనబడుతుందని ఆధారాలతో సహా ట్వీట్ చేస్తున్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఈ ఇద్దరితో పాటు జోస్ బట్లర్(35), షిమ్రాన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) విలువైన పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. భువీ, రోమియో తలో వికెట్ పడగొట్టారు.