SRH vs RCB: మలుపు తిప్పిన త్రిపాఠి తప్పిదం.. 5 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ఆర్‌సీబీ ఘన విజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రాహుల్ త్రిపాఠి వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ అవకాశంతో చెలరేగిన కార్తీక్.. 4 బంతుల్లోనే 22 పరుగులు పిండుకోవడంతో మూమెంటమ్ ఆర్‌సీబీ వైపు మళ్లింది.

ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు..
ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచినా నెట్ రన్‌రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తాజా మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ నెగటీవ్‌గా మారింది. దాంతో చివరి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పర్ఫెక్ట్ రివేంజ్..
ఇక ఈ సీజన్ ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి ఆర్‌సీబీ రెండింతల బదులు తీర్చుకుంది. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.

హసరంగా పాంచ్ పటాకా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఎయిడెన్ మార్కరమ్(21), నికోలస్ పూరన్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. వానిందు హసరంగా కెరీర్ బెస్ట్ (5/18) ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్ 2 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications