
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నయా హిట్టర్ దినేశ్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తున్నాడు. కెరీర్ చివరి దశలో దినేశ్ కార్తీక్ 2.oను తలపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన కార్తీక్ కాక.. మరో మెరుపు ఇన్నింగ్స్‌తో తన చోటును ఖాయం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 4 సిక్స్‌లు, ఫోర్‌తో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆడిన 8 బంతుల్లో 5 బౌండరీలు బాదిన కార్తీక్ ఎంత విధ్వంసకరంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
కార్తీక్ సూపర్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఫరూఖ్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి లభించిన లైఫ్‌తో అవకాశం అందుకున్న కార్తీక్.. వరుసగా 6, 6, 4, బాది 22 పరుగులు పిండుకున్నాడు. దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి అతన్ని గౌరవ వందనంతో ఆహ్వానించాడు. 375 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన కార్తీక్ ముందు మోకరిల్లిన విరాట్.. వంగి సలాం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.