SRH vs RCB: సన్‌రైజర్స్ బలహీనత అదొక్కటే.. ఎలా అధిగమిస్తుందో మరి!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఈరోజు సాయంత్రం భీకరపోరు సాగనుంది. 2016 సీజన్లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్.. మరోసారి డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్ కొట్టాలని ఆరాటపడుతోంది. 2013 నుంచి 2019 మధ్య ఏడు సీజన్లలో ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ఓసారి కప్ గెలిచింది. ఇక 2018లో రన్నరప్‌గా నిలిచింది. ప్రతిసారి ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను కలిగి ఉన్న ఆరెంజ్ ఆర్మీ మెరుగైనన ప్రదర్శన చేస్తోంది. అయితే సన్‌రైజర్స్ జట్టుకు ఓ బలహీనత ఉంది.

సమస్యగా విదేశీ ఆటగాళ్ల ఎంపిక
హైదరాబాద్ జట్టుకు విదేశీ ఆటగాళ్ల ఎంపిక ఎప్పుడూ ఓ సమస్యగా ఉంటుంది. జట్టులో గత కొంతకాలంగా మంచి శుభారంభాలు ఇస్తున్న ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో విదేశీ ఆటగాళ్లే. బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్‌ను ఎలాగూ తీసుకోవాల్సిందే. వీళ్లంతా మంచి ఫామ్‌లోనూ ఉన్నారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీకి దుబాయ్‌లో ఆడిన అనుభవం ఉంది. ఒకవేళ ఈ నలుగురిని తీసుకుంటే.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బెంచ్‌పైనే కూర్చోవాలి. అయితే బ్యాటింగ్ విషయంలో కేన్ ఉంటేనే జట్టుకు లాభదాయకం అని అందరూ అంటున్నారు. దీంతో హైదరాబాద్ జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మిడిలార్డర్ బలంగా లేదు
ఇక హైదరాబాద్ జట్టుకు మిడిలార్డర్ బలంగా లేకపోవడం, భారత ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడం అసలు బలహీనత. నలుగురు విదేశీ ఆటగాళ్లు పొతే.. జట్టులో ఏడుగురు స్వదేశీ క్రికెటర్లు ఉంటారు. మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ మినహా తుది జట్టులో చోటు దక్కించుకునే మిగతా ఐదుగురు ఆటగాళ్లకు అంతగా అనుభవం లేదు. వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్ మ్యాచులు ఆడి చాలా నెలలు అయింది. ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, బసీల్ థంపీ వంటి స్వదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఎప్పుడూ ప్రభావం చూపలేదు. ఇదే హైదరాబాద్ బలహీనతగా మారింది. దీన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.

పాండే బాధ్యత తీసుకోవాల్సిందే
బ్యాటింగ్‌లో ఓపెనర్లిద్దరూ చెలరేగి, రషీద్ మాయాజాలం చేస్తే.. హైదరాబాద్ గెలుపు సాధ్యమే. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ బాధ్యత మనీశ్ పాండే తీసుకోవాల్సిందే. హైదరాబాద్ గెలవాలంటే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను తొందరగా పెవియన్ పంపించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థి బెంగళూరు సైతం వార్నర్, బెయిర్‌స్టో జోడీపైనే ప్రణాళికలు రచిస్తోంది. రషీద్‌ను ఎదుర్కోవడానికి బాగానే సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సరైన ప్రణాళికతో బరిలోకి దిగాలి.

హైదరాబాద్‌దే పైచేయి
ఇప్పటి వరకూ చూసుకుంటే బెంగళూరుపై హైదరాబాద్‌దే పైచేయి. ఈ రెండు జట్ల మధ్య 15 మ్యాచులు జరిగాయి. అందులో హైదరాబాద్ 8 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు ఆరింట్లో గెలుపొందింది. కాగా బెంగళూరుపై డెవిడ్ వార్నర్ 9 మ్యాచుల్లోనే 562 పరుగులతో మంచి రికార్డు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ సైతం హైదరాబాద్‌పై 504 పరుగులు చేశాడు. ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక స్కోరు 231.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
పంజాబ్ 'సూపర్ ఓవర్' ఓటమిపై అనిల్ కుంబ్లే ఏమన్నారంటే?