SRH vs RCB: హాఫ్ సెంచరీతో మెరిసిన మ్యాక్స్‌వెల్.. సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్!

చెన్నై: బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 150 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్ తోడవడంతో ఆర్‌సీబీ టపటపా వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాక్సీకి తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) పర్వాలేదనిపించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది.
పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఓ దశలో ఆర్‌సీబీ కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై మ్యాక్సీ తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(11)ను భువనేశ్వర్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో జట్టులోకి వచ్చిన షబాజ్ అహ్మద్(14)తో విరాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నదీమ్ బౌలింగ్ షబాజ్ సిక్సర్ బాదగా.. నటరాజన్ బౌలింగ్‌లో విరాట్ రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆర్‌సీబీ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 47 రన్స్ చేసింది. అయితే నదీమ్ వేసిన ఆ మరసటి ఓవర్‌లోనే భారీ షాట్ ఆడిన షబాజ్ అహ్మద్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.

సూపర్ బౌలింగ్..
క్రీజులోకి వచ్చి మ్యాక్స్‌వెల్ తొలుత డిఫెన్స్‌కు పరిమితమైనా.. రషీద్ బౌలింగ్‌లో ఫోర్‌తో ఖాతా తెరిచాడు. కానీ తర్వాతి రెండు ఓవర్లను సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేసారు. అయితే నదీమ్ వేసిన 11 ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ 6, 4, 6 బాదగా.. కోహ్లీ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 22 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత నట్టూ కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి లోనైన కోహ్లీ.. హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఏబీ డివిలియర్స్(1) కూడా ఔటవ్వడంతో ఆర్‌సీబీ కష్టాలపాలైంది. ఆ తర్వాత సుందర్(8), డానియల్ క్రిస్టియన్(1) తీవ్రంగా నిరాశపరిచారు.

మ్యాక్సీ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి వచ్చిన జేమీసన్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. నటరాజన్ వేసిన 19 ఓవర్లో తన మ్యాడ్ షాట్స్‌తో రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్సీ.. హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతికి క్విక్ డబుల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిదే ఫస్ట్ ఫిఫ్టీ. ఆ మరసటి బంతినే భారీ సిక్సర్ కొట్టిన మ్యాక్సీ.. తర్వాత రెండు పరుగులు తీసి ఆఖరి బంతికి ఔటయ్యాడు. దాంతో ఆర్‌సీబీ 149 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన ఈ పిచ్‌పై 149 రన్స్ చేదించడం హైదరాబాద్‌కు కష్టమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications