
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చేజింగ్‌లో తడబడినా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్లీ లక్ష్యచేధనకే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌లో కూడా కేన్ విలియమ్సన్‌కు అవకాశం దక్కలేదు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. సందీప్ శర్మ స్థానంలో షాబాజ్ నదీమ్ జట్టులోకి రాగా.. మహ్మద్ నబీ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అవకాశం దక్కించుకున్నాడు.
ఇక బెంగళూరు జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. పటిదార్ స్థానంలో పడిక్కల్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. షాబాజ్ అహ్మద్ నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. గత మ్యాచ్‌లో 100 పర్సెంట్ రాణించలేకపోయామని తెలిపిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతుంది. మరోవైపు కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షబాజ్ నదీమ్, టీ నటరాజన్.
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, షాబాజ్ అహ్మద్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, డేనియల్ క్రిస్టియన్, వాషిగ్టన్ సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్.