SRH vs RCB: డుప్లెసిస్ అజేయ హాఫ్ సెంచరీ.. కార్తీక్ కాక మెరుపులు.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు దుమ్మురేపారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) విఫలమైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. దాంతో సన్‌రైజర్స్ ముందు ఆర్‌సీబీ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.

విరాట్ గోల్డెన్ డక్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే గట్టి షాక్ తగిలింది. జగదీష సుచిత్ వేసిన తొలి బంతికే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విరాట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్‌తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ బౌర్లపై ఎదురుదాడికి దిగడంతో ఆర్‌సీబీ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

ఫాఫ్ హాఫ్ సెంచరీ..
ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్‌లో అతని పేస్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకున్న ఆర్‌సీబీ బ్యాటర్లు.. 20 పరుగులు పిండుకున్నారు. రజత్ ఓ బౌండరీ బాదగా.. డుప్లెసిస్ 4, 4, 6 హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. కార్తీక్ త్యాగి వేసిన 12వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదిన ఫాఫ్ డుప్లెసిస్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సుచిత్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రజత్ పటిదార్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 2 పరుగుల వ్యవధిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కార్తీక్ మెరుపులు..
క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ వచ్చిరావడంతోనే స్విచ్ హిట్‌తో భారీ సిక్సర్ బాదాడు. ఫాఫ్ సైతం బ్యాటింగ్‌లో జోరు కనబర్చడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో కార్తీక్ త్యాగీ వేసిన 19వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదాడు. ఫరూఖీ వేసిన ఆఖరి ఓవర్‌లో బౌండరీ లైన్ మీద దినేశ్ కార్తీక్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను రాహుల్ త్రిపాఠి వదిలేయడంతో ఆర్‌సీబీ 6 పరుగులు వచ్చాయి. ఈ అవకాశాన్ని అందుకున్న కార్తీక్ కాక.. మరో రెండు సిక్స్‌లతో పాటు బౌండరీ బాది ఆర్‌సీబీకి భారీ స్కోర్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications