
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఆర్‌సీబీ బరిలోకి దిగుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్‌పై సన్‌రైజర్స్ వేటు వేసింది. వారి స్థానంలో జగదీష సుచిత్, ఫజల్లాక్ ఫరూకీకి అవకాశం ఇచ్చింది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో శ్రేయాస్ గోపాల్, సీన్ అబాట్ దారుణంగా విఫలమయ్యారు. ఇక పిచ్ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రెండు మార్పులు చేశామని సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు.
'టాస్ ఓడాం కాబట్టి ఫీల్డింగ్? బ్యాటింగ్? అనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోయింది. ఏది ఏమైనా ఈ సీజన్‌లో మేం అద్భుతంగా చేజింగ్ చేసాం. బంతితో రాణించడం చాలా ముఖ్యం. కండిషన్స్ నేపథ్యంలో అబాట్, గోపాల్‌కు బదులు ఫరూఖి, సుచిత్‌లను తుది జట్టులోకి తీసుకున్నాం'అని కేన్ మామ తెలిపాడు. దాంతో అఫ్గానిస్థాన్ పేసర్ ఫరూఖి ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.
ఇక సన్‌రైజర్స్‌పై టాస్ గెలవడం చాలా సంతోషంగా ఉందని ఆర్‌సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. గత మ్యాచ్ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్న ఫాఫ్.. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ బౌలింగ్ విభాగం కూడా బాగుందని, సిరాజ్ నెట్స్‌లో చాలా కష్టపడ్డాడని, ఈ మ్యాచ్‌లో తన సత్తా చాటుతాడని చెప్పాడు. ముందుగా సూపర్ బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది.
ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోరపరాజయం చవిచూసింది. 68 పరుగులకే కుప్పకూలిన ఆర్‌సీబీ.. మూమెంటమ్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచి సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జగదీష్ సుచిత్, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హాక్ ఫరూకీ
ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్‌రోర్, దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్