
షార్జా: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగగా.. పంజాబ్ జట్టు మాత్రం కీలక మార్పులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి తీసుకున్న పంజాబ్ మరో అరంగేట్ర ప్లేయర్ నాథన్ ఎల్లిస్‌కు అవకాశం ఇచ్చింది. రవి బిష్ణోయ్ సైతం జట్టులోకి వచ్చాడు.
ప్రస్తుతం లీగ్‌లో ఈ రెండు జట్ల దయనీయ స్థితిలో ఉన్నాయి. సన్‌రైజర్స్ అట్టడుగున నిలవగా.. పంజాబ్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అయితే భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో సన్‌రైజర్స్.. పంజాబ్‌పై విజయం సాధించడం విశేషం. ఈ సీజన్‌లో హైదరాబాద్ గెలిచింది ఈ ఒక్క మ్యాచే.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్(కెప్టెన్), మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్,
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, నాథన్ ఎల్లిస్, రవిబిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్