Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS: చెలరేగిన బౌలర్లు.. చేతులెత్తేసిన పంజాబ్.. సన్‌రైజర్స్ ముందు ఈజీ టార్గెట్!

SunRisers Hyderabad restrict Punjab Kings to 125

షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న హైదరాబాద్ బౌలర్లు.. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దాంతో పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది.

ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లతో 27), కేఎల్ రాహుల్( 21 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్‌సోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్(3/19) పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మయాంక్ అగర్వాల్(5) దారుణంగా విఫలమయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(14) సైతం రాణించలేకపోయాడు. దాంతో పంజాబ్ స్కోర్ బోర్డ్ నెమ్మదిగా సాగింది. ఎయిడెన్ మార్కర్‌మ్(27) నిలదొక్కకునే ప్రయత్నం చేయగా.. నికోలస్ పూరన్(8) నిరాశపరిచాడు. దీపక్ హుడా(13), అరంగేట్ర నాథన్ ఎల్లిస్(12) కూడా విఫలమయ్యారు. చివర్లో హర్‌ప్రీత్ బ్రార్(18 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో పంజాబ్ 120 పరుగులు చేయలగలిగింది.

Story first published: Saturday, September 25, 2021, 21:38 [IST]
Other articles published on Sep 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+