Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS: సన్‌రైజర్స్ కొంపముంచిన నితీష్‌ కుమార్ రెడ్డి!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది.

యువ ఓపెనర్ అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు. చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్(2/30) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్‌కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.

SRH vs PBKS Punjab Kings post 215-run target in IPL 2024

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి మూడు బంతులను జితేశ్ శర్మ 4, 6, 6 బాది 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ మూమెంటమ్ పంజాబ్ వైపు మళ్లింది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన నితీష్ కుమార్ రెడ్డి ఒక్క వికెట్ తీయకుండా 54 రన్స్ ఇచ్చుకున్నాడు. అతని పేలవ బౌలింగ్ సన్‌రైజర్స్ కొంపముంచింది.

అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు అథర్వ టైడ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతూ పరుగుల మోత మోగించారు. దాంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.

అనంతరం మరింత ధాటిగా ఆడిన పంజాబ్‌కు నటరాజన్ షాకిచ్చాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అథర్వ టైడ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రిలీ రోసౌతో కలిసి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

జితేశ్ శర్మ మెరుపులు..
ఈ ఇద్దరూ సైతం దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని యువ స్పిన్నర్ విజయకాంత్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగిన ప్రభ్‌ సిమ్రాన్ సింగ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చి శశాంక్ సింగ్ నితీష్ కుమార్ రెడ్డి సూపర్ త్రోకు రనౌటవ్వగా.. రీలీ రోసౌను కమిన్స్ ఔట్ చేశాడు.

అషుతోష్ శర్మను నటరాజన్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ పరుగుల వేగానికి బ్రేక్ పడింది. అయితే జితేశ్ శర్మ ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను ధాటించాడు. చివరి ఓవర్‌లో 4, 6, 6 బాది 19 పరుగులు పిండుకున్నాడు.

Story first published: Sunday, May 19, 2024, 17:26 [IST]
Other articles published on May 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+