Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS: ఛీ పోరా.. కెమెరామెన్‌పై కస్సుమన్న కావ్య పాప! (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ 2023‌ సీజన్‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమ్ ఓనర్ కావ్య మారన్ తెగ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పదే పదే తనను చూపిస్తున్న టీవీ కెమెరామెన్‌పై కావ్య మారన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ సందర్భంగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ భారీ సిక్సర్లు బాదినప్పుడు కావ్య మారన్ రియాక్షన్ ఎలా ఉందనే విషయాన్ని కెమెరామెన్ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయగా.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఛీ పోరా'అనే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 Kaviya Marans Reaction To TV Cameraman

పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో ధావన్ వరుసగా రెండు బౌండరీలు కొట్టగా.. కెమెరామెన్ కావ్య పాపను చూపించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె చిర్రెత్తుకుపోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 99 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌‌తో రాణించగా.. సామ్ కరణ్(22) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే(4/15) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 నాటౌట్), ఎయిడెన్ మార్క్‌రమ్(21 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్)రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 9, 2023, 23:31 [IST]
Other articles published on Apr 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+