Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS: రేయ్ ఎవర్రా మీరంతా!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే కావ్య మారన్‌ను చూసేందుకే మైదానాలకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సినీ హీరోయిన్ తలపించే ఆమె అందానికి పడి చచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు.

ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తాయి. గత ఐదారేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా తమ జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ కావ్య మారన్ స్టేడియంలో సందడి చేస్తోంది.

SRH vs PBKS IPL 2025 Kavya Maran Fans Reaction goes Viral

ఐపీఎల్ 2025 సీజన్‌లో‌నూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు కావ్య మారన్ హాజరవుతోంది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు కూడా కావ్య మారన్ హాజరైంది. మ్యాచ్ ఆసాంతం తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సందడి చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన కొందరు అభిమానులు.. కావ్య మారన్‌పై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకుల స్టాండ్స్‌లో నిలబడి 'హైదరాబాద్ టీమ్‌కా బహుత్ అచ్చా.. కావ్య పాప నేను నీ కోసమే వచ్చా'అని గట్టిగా అరిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సదరు అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది. కావ్య పాప క్రేజ్ ఇది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'రేవ్ ఎవర్రా మీరంతా'అని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం కావ్య పాప గురించి మాట్లాడితే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. చివర్లో హర్షల్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్‌‌కు బ్రేక్ వేయగా.. ఆఖరి ఓవర్‌లో షమీ ధారళంగా పరుగులిచ్చాడు. స్లోయినీస్(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) వరుసగా నాలుగు సిక్స్‌లు బాది గేమ్ మూమెంటమ్‌ను మార్చేశాడు. నాలుగు ఓవర్లలో షమీ 75 పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Saturday, April 12, 2025, 22:15 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+