Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ సెంచరీ సెలెబ్రేషన్స్.. ఆ పేపర్‌లో ఏం రాసి ఉందంటే..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. జేబులో నుంచి ఓ పేపర్ తీసి.. అందరికి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.

ఆ పేపర్‌పై 'This one is for Orange army(ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం)'అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. 'రాసి పెట్టుకొని మరి కొట్టాడు సామీ'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

SRH vs PBKS IPL 2025 Abhishek Sharma s 40-Ball Century Celebration Goes Viral
Photo Credit: IPL (X)

పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల తప్పిదాలతో పాటు యశ్ ఠాకూర్ నోబాల్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి బచాయించిన అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మరో 21 బంతుల వ్వవధిలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించిన అభిషేక్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత మరో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ‌తో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు.. 44 బౌండరీలు నమోదయ్యాయి.

Story first published: Saturday, April 12, 2025, 23:08 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+